మాదాపూర్, ఫిబ్రవరి 7: నైపుణ్యం కలిగిన కార్మికులకు సురక్షితమైన ఉపాధి అవకాశాలను కల్పించడం టోమ్కాన్ ముఖ్యమైన లక్ష్యమని ఐఎఫ్ఎస్ ఇండస్ట్రీస్, సీఈవో, స్పెషల్ సెక్రటరీ, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని న్యాక్ క్యాంపస్ లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టోమ్కాన్) ఇండో యూరో సింక్రోనైజేషన్, ఆర్పీ సొల్యూషన్స్ జీహెచ్బీహెచ్ సంయుక్తంగా అంతర్జాతీయ ఉద్యోగ ఒప్పందాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎఫ్ఎస్ ఇండస్ట్రీస్, సీఈవో, స్పెషల్ సెక్రటరీ, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి విచ్చేసి జర్మన్ వర్సిటీ ఎండీ రాజ్ వెంకట్, ఇండో యూరో సింక్రోనైజేషన్ సీఈవో, డాక్టర్ ఎన్. బంగార్రాజు, న్యాక్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతి శ్రీ, ఆర్పీ సొల్యూషన్స్ జీఎంబీహెచ్ ఎండి వెంకట్‌రెడ్డి, ఆర్పీ సొల్యూషన్స్ జీఎంబీహెచ్ ఎండీ అల్వారో పెరైరాతో కలిసి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ … టోమ్కాన్ నైపుణ్య కార్యక్రమాలను పటిష్టంగా, నైతికంగా సురక్షితంగా అమలు చేయడంలో తమ నిబద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసి, నైపుణ్యం కలిగిన కార్మికులను సురక్షితమైన ఉపాధి అవకాశాలను కల్పించడం టోమ్కాన్ ముఖ్యమైన లక్ష్యమని విష్ణువర్దన్ రెడ్డి అన్నారు.
అనంతరం జర్మన్ వర్సిటీ ఎండీ రాజ్ వెంకట్ మాట్లాడుతూ.. టోమ్కాన్, ఐఈఎస్, ఆర్పీ సొల్యూషన్స్ జీఎంబీహెచ్ల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పడటంతో నైతిక, సమగ్రమైన అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను కల్పించచేందుకు ఎంతో కృషి దాగి ఉందని అన్నారు. కార్యక్రమంలో ప్రధానంగా 80 మంది ఎలక్ట్రీషియన్లకు ఉద్యోగ ఒప్పందాలు పంపిణీ చేయబడినట్లు నిర్వాహకులు తెలిపారు. జర్మనీలో వృత్తిపరమైన ప్రయాణానికి ఇది ప్రాముఖ్యతను కల్పించడంతో పాటు మరిన్ని అవకాశాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.