ఆస్తిపన్ను చెల్లింపులకు నేడే ఆఖరు
ఆస్తిపన్ను చెల్లింపుల తుది గడువు మంగళవారంతో ముగుస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు అర్ధరాత్రి వరకు చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ట్రై కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ. 2,344 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు కాగా..సోమవారం ఒక్క రోజు రూ. 50 కోట్ల మేర వసూలైనట్లు అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో: ఆస్తిపన్ను చెల్లింపుల తుది గడువు మంగళవారంతో ముగుస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు అర్ధరాత్రి వరకు చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ట్రై కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ. 2,344 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు కాగా..సోమవారం ఒక్క రోజు రూ. 50 కోట్ల మేర వసూలైనట్లు అధికారులు తెలిపారు. రూ. 2,500కోట్ల నిర్ధేశిత లక్ష్యంలో రూ. 2,394 కోట్లకు చేరిందని, టార్గెట్ అధిగమిస్తామని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో అత్యధికంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ. 940 కోట్లు, రెండో స్థానంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో రూ.889.50 కోట్లు, మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.518 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు.
ఓటీఎస్‌కు స్పందన అంతంతే..
ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు సరార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి డిసెంబర్ మాసం నుంచే మొండి బకాయిలు చెల్లించే వారికి పన్నుపై విధించిన వడ్డీల్లో 90 శాతం రాయితీనిస్తూ ఓటీఎస్ సీమ్‌ను అమలు చేస్తున్నారు. ఈ సీమ్‌కు కూడా నేటితో గడువు ముగియనున్నది. ఇప్పటికే రూ. వేల కోట్లలో పేరుకుపోయిన ఈ మొండి బకాయిల్లో మార్చి నెలాఖరు కల్లా కనీసం రూ. వెయ్యి కోట్ల వసూలు చేసుకోవాలని అధికారులు మూడు కార్పొరేషన్లలో మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేసి, ప్రస్తుతం పన్ను చెల్లించని ఆస్తులను సీజింగ్ కూడా చేస్తున్నారు. మూడు నెలల సమయం ఇచ్చినా బకాయిదారులు ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోలేదు.
వైద్య పరీక్షలకు వస్తే.. గొలుసు మాయం
బంజారాహిల్స్: వైద్య పరీక్షల కోసం అపోలో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు మాయమైంది. ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన సుశాంక్ సింగ్ రాజ్‌పుత్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన తల్లి రాధా రాజ్‌పుత్‌కు వైద్య పరీక్షలు చేయించేందుకు ఈనెల 28న ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రిలోని క్యాన్సర్ బ్లాక్‌కు తీసుకువచ్చాడు. స్కానింగ్ కోసం ఆమెను ఆస్పత్రి సిబ్బంది ల్యాబ్‌కు తీసుకువెళ్లారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి చూడగా, ఆమె మెడలో ఉండాల్సిన 3 తులాల గొలుసు కనిపించలేదు. ఈ విషయాన్ని గురించి సిబ్బందిని ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ మేరకు స్కానింగ్ ల్యాబ్‌లోకి వెళ్లివచ్చిన సమయంలోనే తన తల్లి గొలుసు మాయమైందంటూ.. సుశాంక్సింగ్ ఫిర్యాదుతో ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

