సుల్తాన్ బజార్ ఫిబ్రవరి 19. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం ముజీబ్ హుస్సేనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు సంఘం నాయకులతో కలిసి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ,పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, కొత్త జిల్లాల లో అదనపు క్యాడర్స్, ఉద్యోగుల హెల్త్ కారడ్స్ తదితర అంశాల పట్ల ప్రభుత్వం వెంటనే ఆలోచించి పరిష్కరించాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చ జరిపామని తెలిపారు. ఈ విషయమై స్పందించిన ముఖ్యమంత్రి సానుకూలంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఎవరు ఆందోళనకు గురి కావొద్దని చెప్పినట్టు వెల్లడించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు ఇతర సంఘ నాయకులుపాల్గొన్నారు.