Hyderabad | హైదరాబాద్‌లోని మలక్‌పేట–దిల్సుఖ్నగర్ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మలక్‌పేట చౌరస్తా టీవీ సమీపంలో ఆస్మాన్‌గఢ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపుతప్పింది. దీంతో రోడ్డుపై ఉన్న డివైడర్ నుంచి దూసుకెళ్లి ఒక బస్సు, మరో లారీని ఢీకొట్టి ఆగిపోయింది.
వేగంగా దూసుకొస్తున్న టిప్పర్‌ను గమనించి పలు వాహనదారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదం వల్ల అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం
హైదరాబాద్ – మలక్‌పేట్‌లోని తిరుమలహిల్స్ ప్రాంతం నుండి వేగంగా వస్తూ బ్రేకులు ఫెయిల్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టి, మరో లారీ, బస్సును బలంగా ఢీకొట్టిన టిప్పర్ లారీ
దీంతో రహదారిపై ఇరువైపుల భారీగా నిలిచిపోయిన వాహనాలు pic.twitter.com/sYf75wng95
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025