TSRTC | సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్.. క్యాష్తో పాటు క్యాష్‌లెస్ టికెట్ విధానం
నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
TSRTC | సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై గత ఏడాదిలోనే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని భావించారు. కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనట్లు అధికారులు చెప్పారు.
అయితే ఈ ఏడాదిలోనైనా.. సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ విధానాన్ని అమలు చేసే అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాలకు తిరిగే సూపర్‌లగ్జరీ బస్సుల్లో నగదుతో పాటు ఫోన్‌పే క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ ప్రక్రియ రెండు విధాలుగా కొనసాగుతున్నాయి. ఇదే విధానం సిటీ బస్సుల్లో అమలు చేయాలన్న ఆలోచనతోనే ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా..నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు తిరుగుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో అమలు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

