కీసర, మార్చి 31 : బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాకేశ్.. శామీర్‌పేట్‌లోని లియోనియోలో క్యాటరింగ్లో పనిచేస్తున్నాడు. సోమవారం తన స్నేహితుడు హేమంత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కీసరకు పని నిమిత్తం వెళ్లాడు. తిరిగి శామీర్‌పేట్‌కు వెళ్తుండగా కీసర ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హేమంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108లో దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బస్సును ఓవర్టేక్ చేయబోయి బైక్‌ను ఢీకొని..
మల్లాపూర్, మార్చి 31 : బస్సును ఓవర్ టేక్చేసే క్రమంలో అతివేగంతో ఉన్న కారు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చర్లపల్లి పోలిస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చర్లపల్లిలో నివాసముంటున్న కొండిపాటి పుల్లారావు(32), భార్య మల్లేశ్వరి, కుమారులు రుత్విక్, రాజేశ్‌లతో కలిసి అశోక్ననగర్ నుంచి చర్లపల్లికి బైక్(ఏపీ09ఎఎన్1691)పై వెళ్తున్నాడు. మార్గ మధ్యలో స్కాప్ షాప్ వద్దకు రాగానే చర్లపల్లి నుంచి అశోక్‌నగర్‌కు వెళ్తున్న కారు (టీఎస్ 07యూహెచ్ 6562) అతివేగంగా వస్తూ ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టెక్ చేసే క్రమంలో పుల్లారావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో పుల్లారావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ రవికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు..
మేడ్చల్, మార్చి 31 : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం…మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికులు కృష్ణ కుమార్(19), రోహిత్‌కుమార్, బిజయ్ కుమార్‌లు కలిసి అర్ధరాత్రి చెక్‌పోస్ట్ కిష్టాపూర్ రోడ్డులోని గణేశ్ ధర్మకాంట సమీపంలో రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం కృష్ణకుమార్‌ను ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.