భార్యలతో గొడవలు..
భార్యలతో గొడవల కారణంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు అదృశ్యం అయ్యారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన రాజ్‌కుమార్(24) బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో భార్య రింకీ సైకియాతో కలిసి నివాసం ఉంటున్నాడు. మాసాబ్‌ట్యాంక్‌లోని ఓ ఆస్పత్రిలో సెక్యురిటీ గార్డులుగా వీరిద్దరూ పనిచేస్తున్నారు.
- వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తుల అదృశ్యం
బంజారాహిల్స్, మే 19: భార్యలతో గొడవల కారణంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు అదృశ్యం అయ్యారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన రాజ్‌కుమార్(24) బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో భార్య రింకీ సైకియాతో కలిసి నివాసం ఉంటున్నాడు. మాసాబ్‌ట్యాంక్‌లోని ఓ ఆస్పత్రిలో సెక్యురిటీ గార్డులుగా వీరిద్దరూ పనిచేస్తున్నారు. ఈనెల 17న ఇంట్లో ఉన్న సమయంలో భార్యతో తీవ్రస్థాయిలో గొడవ చోటుచేసుకోవడంతో తన చేతిలోని ఫోన్‌ను విసిరికొట్టి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు.
ఈ మేరకు భార్య రింకీ సైకియా మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని షౌకత్‌నగర్‌లో భార్య శివకుమారితో కలిసి నివాసం ఉంటున్న లోకేష్‌కుమార్(32)రోజు కూలీ. గత కొంతకాలంగా రోజూ మద్యం సేవించడంతో పాటు భార్యను తరచూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఈనెల 17న సాయంత్రం మద్యం మత్తులో భార్యతో గొడవపడిన లోకేష్‌కుమార్ అమెను కొట్టి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
రెండ్రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో భార్య శివకుమారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరొక ఘటనలో భార్యకు చెప్పకుం డా ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఘటన బంజారాహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని అరోరా కాలనీలో నివాసం ఉంటున్న ముల్లంగిరాజా (40) అనే వ్యక్తి ఈనెల 16న ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ మేరకు భార్య జయకుమారి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

