సికింద్రాబాద్, జూలై 5: ఒక స్కూటీకి రిజిస్ట్రేషన్ అయిన నంబర్‌ను మరో రెండు స్కూటీలకు తగిలించి మోసం చేశారు. వారాసిగూడలో తనిఖీలు నిర్వహించగా భీమ్ అజయ్‌రెడ్డి పట్టుబడ్డాడు. సాయిరామ్ అనే వ్యక్తికి చెందిన ఫైనాన్స్ చేయబడ్డ ద్విచక్ర వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించలేదు. సాయిరామ్ తన అప్పు తీర్చడం కోసం ఆ వాహనాన్ని మల్లికార్జున్‌కు ఇచ్చాడు. అదే వాహనానికి ఇండస్ఇండ్ బ్యా ంకుకు రూ. 36వేలు బకాయి చెల్లించాల్సి ఉంది.
దాన్ని తప్పించుకోడానికి వాహనం సీజ్ కాకుండా మల్లికార్జున్ తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనం (టీఎస్09ఎఫ్ఈ4997) వాహనం నంబర్ ప్లేట్లను తయారు చేయించి దానికి తగిలించి భీమ్ అజయ్‌రెడ్డికి ఇచ్చాడు. అంతే కాకుండా ట్రాఫిక్ చలానాలను తప్పించుకోడానికి మల్లికార్జున్ స్నేహితుడు ధనరాజ్‌కు కూడా అదే నంబర్ ప్లేట్ చేయించి ఇచ్చాడు. నిందితులపై కేసు నమోదు చేశారు.