ఖైరతాబాద్, మార్చి 3 : క్రివీ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని కస్తూర్బా మహిళ డిగ్రీ పీజీ కాలేజీ ఆవరణలో వెయ్యి మంది విద్యార్థినులతో తెలంగాణ జానపద నృత్య కార్యక్రమాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వేద కీర్తి తెలిపారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో వేద కీర్తి మాట్లాడుతూ.. సేవ్ గర్ల్ చైల్డ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులను మానసికంగా, శారీరకంగా దృఢ సంకల్పాన్ని నింపేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వెయ్యి మంది విద్యార్థినులు ఏకకాలంలో తెలంగాణ జానపద ముత్యం చేస్తారని, ప్రపంచంలో ఇలాంటి ఫీటు ఎక్కడా లేదని అన్నారు. ప్రపంచ లిమ్ కా, హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఫౌండేషన్ ప్రతినిధులు సరిత సింగ్, దిశా వైష్ణవ్, బ్లెస్సి, అనఘా, దీపక్ సింగ్తో కలిసి ఆవిష్కరించారు.