సిటీబ్యూరో: గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారి ఎల్వీ రావు తెలిపారు.
ఏప్రిల్ మాసంలోనే 42 డిగ్రీలకు చేరే చాన్స్ ఉందన్నారు. సోమవారం గరిష్ఠం 36.9, కనిష్ఠం 25.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.