కాచిగూడ,డిసెంబర్ 16: అజంతా రైల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం.. కూకట్పల్లి, కేబీహెచ్‌బీ కాలనీ 9వ పేస్‌కు చెందిన సాయి సూరజ్(22)వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. అజంతా రైల్లో కాచిగూడకు వస్తుండగా మార్గమధ్య మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు సాయి సూరజ్ బ్యాగులోంచి రూ.7 వేల రుపాయలు, డెబిట్, క్రెడిట్ కార్డులు దొంగిలించారు. మంగళవారం బాధితుడి ఫిర్యాదు మేరకు కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకోని తదుపరి విచారణ నిమిత్తం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బదిలీ చేసినట్లు రైల్వే సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG TET 2026 | తెలంగాణ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
Rashmi Gautam | రష్మి గౌతమ్ పెళ్లికి టైమ్ ఫిక్స్..? ఆస్ట్రాలజర్ వ్యాఖ్యలతో మళ్లీ హాట్ టాపిక్