IPL 2026 Auction | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం ప్రారంభమైంది. వేలం ప్రారంభానికి ముందు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత ఐపీఎల్ వేలం మొదలు కాగా.. మొదట రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ వేలానికి వచ్చాడు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వేలానికి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌కు అతన్ని దక్కించుకుంది. టీమిండియా మాజీ ఆటగాడు, పృథ్వీ షా వేలంలోకి రాగా.. ఫ్రాంచైజీలు అతన్ని పట్టించుకోలేదు. రూ.75లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి రాగా.. అతని వైపు ఆసక్తిని చూపించలేదు. ఆ తర్వాత రూ.కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన డెవాన్ కాన్వేని సైతం పట్టించుకోకపోవడంతో అమ్ముడుపోలేదు. ఆ తర్వాత వేలానికి వచ్చిన కామెరాన్ గ్రీన్ రూ.2కోట్ల బ్రేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. ప్రారంభంలో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అతన్ని తీసుకునేందుకు ఆసక్తిని చూపించారు.
ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడింది. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ సైతం పోటీపడ్డాయి. దాంతో రూ.13కోట్ల వరకు ధర పెరగ్గా.. ఆ తర్వాత సీఎస్కే సైతం వేలంలోకి ఎంట్రీ ఇచ్చింది. చెన్నై, కేకేఆర్ మధ్య పోటీలు రసవత్తరంగా సాగింది. చివరకు కేకేర్ కామెరాన్ గ్రీన్‌ను రూ.25.20కోట్ల కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలాల్లో అత్యధిక ధరను దక్కించుకున్న మూడో ప్లేయర్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ నిలిచాడు. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27కోట్లకు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు రూ.26.75కోట్లకు శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. తాజాగా కామెరూన్ గ్రీన్ రూ.25.20 కోట్ల ధరతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, అత్యధిక ధరకు అమ్ముడయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. ఇదిలా ఉండగా.. గ్రీన్ తర్వాత వేలంలోకి వచ్చిన ముంబయి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకునేందుకు జట్లు ఆసక్తి చూపించకపోవడంతో అమ్ముడుపోలేదు.