కాచిగూడ,ఆగస్టు 8: గ్వాలియర్ రైల్లో ప్రయాణికుని నగదు, ఖరీదైన బట్టలు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర దేశ్‌ముఖ్ కుమారుడు భవాని దేశ్‌ముఖ్(43)గ్వాలియర్ రైల్లో జూన్ 29వ తేదీన మధ్యప్రదేశ్‌కు వెలుతుండగా మార్గమధ్య కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆమె బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.
అందులో రూ.3 వేల రూపాయలు, ఖరీదైన సూట్, బట్టలు ఉన్నట్లు తెలిపారు.బాధితుని పిర్యాదు మేరకు గ్వాలియర్ రైల్వేస్టేషన్లో పిర్యాదు చేశాడు. అక్కడ కేసు నమోదు చేసుకోని కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలి చేశారు. శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రైల్వే సీఐ తెలిపారు.