హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇంటిని గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 47 తులాల బంగారం, రూ.11 వేల నగదుతో పాటు ఖరీదైన విదేశీ వాచీలు ఎత్తుకెళ్లారు.
గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.