మూసాపేట మార్చి 17: కూకట్పల్లిలో(Kukatpally) భారీ దారి దోపిడీ కలకాలం రేపింది. బహుదూర్ పూరకు చెందిన అజీముద్దీన్ కుష్రాఫ్ బైక్ పై డబ్బుతో వెళుతుండగా నలుగురు గుర్తుతెలియని దుండగులు వీరిని అడ్డుకొని కళ్లలో కారం చల్లి వారి నుంచి కోటి రూపాయల నగదును తీసుకొని పారిపోయారు. ఈ సంఘటన కూకట్పల్లి ఏసీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో జరగడం గమనార్హం.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజుల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.