హైదరాబాద్ : బహదూర్పురా తహసీల్దార్ ఆఫీసులో సోమవారం తెల్లవారు జామున దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు తలుపులు బద్దలు కొట్టిన దొంగలు కార్యాయం లోపలికి ప్రవేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు.
కార్యాలయం నుంచి ఏమైనా ఫైల్స్ ఎత్తుకెళ్లారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.