బండ్లగూడ, నవంబర్ 12 : రాజేంద్రనగర్ పోలీస్ష్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకులే కుండా పోతున్నది. గత నెల రోజులుగా వారంలో ఒకటి రెండు చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస దొంగతనాలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మంగళవారం ఓ అపార్ట్మెంట్లో దొంగలు పడి 11తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. అదే రోజు రాత్రి బండ్లగూడ ఎస్ ఎఎన్క్లేవ్లో ఓ సాఫ్ట్వేర్ ఇంట్లో దొంగలు పడి 31 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఎం ఎన్క్లెవ్ డూప్లెక్స్ ఇంట్లో నివాసం ఉంటుంన్న కిరణ్ తన కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లి వచ్చారు. అనంతరం వారు నిద్రలోకి జారుకున్నాక దొంగలు వంటగది నుంచి లోనికి ప్రవేశించి 30తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.