మియాపూర్, ఏప్రిల్ 12: కొనుగోలుదారుల మంటూ దుకాణంలోకి వచ్చి విక్రేతలు, సేల్స్ మెన్లను మభ్యపెట్టి చీరలు దొంగిలిస్తున్న ఓ ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమా ర్, సీఐ క్రాంతి, డీఐ రమేష్నాయుడుతో కలిసి మియాపూర్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు సంబంధించిన పలువురు ఓ ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పా ల్పడుతున్నారు. ఈనెల మూడవ తేదీన మి యాపూర్ ఎంఏనగర్లో ఓ వస్త్ర దుకాణంలో ఈ బృందం విక్రేతలను మాయ చేసి విలువైన చీరలను చోరీ చేసింది . దుకాణదారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దొంగల ముఠాను అరెస్టు చేశారు.
ఈ ముఠా మియాపూర్, మధురానగర్, సరూర్ నగర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దుకాణాలలో విలువైన చీరలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వెంకటేశ్వరరావు, సుభాషిని, యశోద, తిరుపతమ్మ ,రమణ, వెంకటేశ్వరమ్మ, వెం కటేశ్వర్లును అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.