తాగుడుకుబానిసై యువకుడు ఆత్మహత్య
తాగుడుకు బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జవహర్‌నగర్, జనవరి 1: తాగుడుకు బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్ కథనం ప్రకారం… జమ్మిగడ్డలోని నెహ్రూనగర్‌లో వేముల సత్యనారాయణ, భార్య పద్మ, కుమార్తె, కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. కుమార్తె చదువుకుంటుండగా, కుమారుడు వేముల మధు(20) యాప్రాల్‌లోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు.
శనివారం కొత్త బట్టలు, బూట్లు కొనుక్కొని ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కుమారుడి కోసం ఎదురు చూసిన కుటుంబసభ్యులు సమయానికి రాకపోవడంతో నిద్రపోయారు. ఆదివారం ఉదయాన్నే ఇంటి ఆవరణలో సీలింగ్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. చుట్టుపక్కలవారు గమనించి ఇంటి యజమానికి తెలిపారు. అతను వెంటనే కుటుంసభ్యులను లేపి చూసేసరికి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు.
తల్లిదండ్రులు కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని రోధిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దింపి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

