హిమాయత్‌నగర్,డిసెంబర్15: ప్రైవేట్ పార్ట్స్‌ను చేతులతో తాకి శుభ్రం చేసుకోకుండానే కూరగాయలను విక్రయిస్తున్న ఓ వ్యక్తికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించింది. నారాయణగూడ ఇన్ స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణగూడలోని మేల్కొటే పార్క్ సమీపంలో మహ్మద్ వాసిక్(38) కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్‌ను చేతులతో తాకి అదే చేతితో కూరగాయలు విక్రయిస్తున్నాడు.
ఈ ఘటనను గుర్తించిన స్థానిక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఆధారంగా ఈ-పెట్టి కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ వాసిక్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించి అతని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానంలో వాసిక్కు ఐదు రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించిందని సీఐ సైదేశ్వర్ తెలిపారు. ప్రజా రోగ్యానికి భంగం కలిగించే వారికి చట్ట పరమైన చర్యలు తప్పని హెచ్చరించారు.