TRS government is ready to help the poor | పేదలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు అండగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన ఇద్దరు లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరయిన చెక్కులను ఎమ్మెల్యే మాగంటి శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో అందజేశారు.
రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి చికిత్స కోసం రూ.48వేలు, నాగేశ్వరి అనే మహిళకు రూ.20వేల చెక్కును ఎమ్మెల్యే మాగంటి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు రకాలైన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు.
పేదలకు న్యాయం కలుగుతుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు.శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, ఫయాజ్, సమద్, ఇలియాజ్, విశాల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

