నేడు మోగనున్న బడిగంట
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం బడిగంట మోగనుంది. ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్ పరిధిలో 17ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు 47 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
- ‘మన బడి-మనబస్తీ’లో భాగంగా మౌలిక వసతులు
- వేసవి సెలవులు ముగియడంతో తెరుచుకోనున్న స్కూళ్లు
- ఖైరతాబాద్ విద్యాశాఖ పరిధిలో పాఠ్య పుస్తకాలు సిద్ధ్దం
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం బడిగంట మోగనుంది. ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్ పరిధిలో 17ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు 47 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తొలిరోజునుంచే పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. పాఠ్య పుస్తకాలు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను సరిదిద్దేందుకు పక్కా ప్రణాళిక రూపొందించిన అధికారులు సుమారు 28వేల పుస్తకాలను ఇప్పటికే ఆయా స్కూళ్లకు పంపించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వందశాతం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని ఇప్పటికే అన్ని స్కూళ్ల హెడ్మాస్టర్లు ఆదేశాలు జారీ అయ్యాయి.
బంజారాహిల్స్,జూన్ 11
స్కూళ్లకు తుది మెరుగులు..
నూతన విద్యాసంవత్సరంలో భాగంగా సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానుండడంతో మనబస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని షేక్‌పేట మండల పరిధిలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు కోటిన్నర వ్యయంతో మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నారు. వీటిలో భాగంగా అదనపు తరగతి గదులు, టాయ్‌లెట్స్ నిర్మాణాలు, ప్రహరీల నిర్మాణం, పాడైపోయిన గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు చిన్న చిన్న మరమ్మతు పనులను యుద్ధ్ద ప్రాతిపదికన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో రంగులు వేస్తుండగా మరికొన్ని పాఠశాలల్లో కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

