అనర్హులకు అందలం!
గోలొండ సరిల్ పరిధిలో టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. కలిగిన కాంట్రాక్టర్లను కాదని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను తిరస్కరిస్తూ..ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లాల్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ వరికుప్పల స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
- గుర్రపుడెక, చెత్త తొలగింపు పనుల కేటాయింపు ఏకపక్షం
- గోల్కొండ సర్కిల్లో వివాదాస్పదమైన టెండర్లు
- ఈఈ వైఖరిని నిరసిస్తూ బల్దియా ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ ) : గోలొండ సరిల్ పరిధిలో టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. కలిగిన కాంట్రాక్టర్లను కాదని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను తిరస్కరిస్తూ..ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లాల్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ వరికుప్పల స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లతో కలిసి ఆందోళన చేపట్టారు. పురానాపూల్ బ్రిడ్జి నుంచి అత్తాపూర్ బ్రిడ్జి వరకు మూసీ డీ-సిల్టింగ్ పనులకు ఇటీవల విడుదలైన టెండర్లో ఇతర సరిళ్లలో ఎకడా లేని విధంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ తప్పనిసరి అనే నిబంధన చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగాహిటాచీ వంటి యంత్రాలతో చేసే పని అయినప్పుడు ఈఎస్ఐ, ఈపీఎఫ్ నిబంధనలు ఎందుకు పెట్టారని కాంట్రాక్టర్లు ప్రశ్నించారు.
గోలొండ సరిల్ పరిధిలో..
గోలొండ సరిల్ పరిధిలోని షాహాతిమ్ తలాబ్, లంగర్ హౌస్ చెరువులలో పేరుకుపోయిన గుర్రపుడెక, చెత్తను తొలగించేందుకు (టెండర్ ఐడీ 711675 – విలువ రూ. 3,91,48,400), మూసీ నది పురానాపూల్ బ్రిడ్జి నుండి అత్తాపూర్ బ్రిడ్జి వరకు గుర్రపుడెకను తొలగించేందుకు (టెండర్ ఐడీ: 711678 – విలువ రూ. 38,66,840) టెండర్లు ఆహ్వానించారు. ఈ పనుల కోసం హిటాచీ మిషన్లను వినియోగించాల్సి ఉండటంతో, కాంట్రాక్టర్ వరికుప్పల స్వామి తన ఏజెన్సీ తరఫున టెండర్లు దాఖలు చేశారు.
ఏకపక్షంగా టెండర్ల రిజెక్ట్
సాధారణంగా ఈ భారీ మిషనరీ పనులలో లేబర్ కాంపోనెంట్ (ఈఎస్ఐ, పీఎఫ్) చాలా తకువగా (దాదాపు 2 నుంచి 3 శాతం) ఉంటుంది. ఐతే సదరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈ తకువ లేబర్ వ్యయాన్ని సాకుగా చూపుతూ, కాంట్రాక్టర్ ఈఎస్ఐ, పీఎఫ్ వివరాలను సరిగ్గా సమర్పించినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా టెండర్లను రిజెక్ట్ (తిరసరించారు) చేశారని బాధితుడు ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా గోలొండ సరిల్ పరిధిలో జరిగిన అన్ని టెండర్ల ప్రక్రియలపై రాష్ట్ర విజిలెన్స్ శాఖ, జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగాల ద్వారా సమగ్రమైన, నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని కాంట్రాక్టర్లు స్వామి, సాయి కిరణ్లు కోరారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న ఈఈ లాల్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని వరికుప్పల స్వామి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ESI
- GHMC
- Golonda Saril
- Musi
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

