సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో భానుడు మండిపోతున్నాడు. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండడంతో నగర వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2డిగ్రీలు, గాలిలో తేమ 32శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.