Telangana Vidyarthi JAC | కాచిగూడ, జనవరి 3: స్కాలర్షిప్ల కోసం ప్రతియేడు 12 లక్షల 80 వేల మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకుంటే 2025-26 సంవత్సరానికి కేవలం 7 లక్షల 45 వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని,5 లక్షల మంది తగ్గారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆరోపించారు. విద్యార్థుల 11 వేల కోట్ల పెండింగ్ పీజుల బకాయిలను విడుదల చేయాలని కోరుతూ శనివారం ర్యాలీగా బర్కత్పుర రోడ్డుపై మందలాది విద్యార్థులతో బైటాయించడంతో ఆ ప్రాంతంలో గంటసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
అనంతరం వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు కాదని, ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత దోరణితో 5 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమతున్నారని ద్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా విద్యార్థులకు కేవలం రూ.6 వందల కోట్లు చెల్లించడంతో విద్యార్థులకు కనీసం ఒక్క బిస్కెట్ కూడ రాదని ఆరోపించారు. రాష్ట్రంలో ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు నోచుకోవడంలేదన్నారు.ఈ కార్యక్రమంలో ప్రణీత, స్నేహ, అవంతి, ప్రియాంక, సింధు, వైష్టవి, గీత, రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.