
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): డబ్బు సంపాదించడం కన్నా, సమాజానికి సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో పెరుగాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల డయాలసిస్‌లు పూర్తి చేసిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ట్రస్ట్ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజుకు 500 డయాలసిస్‌లు చేస్తున్నారని, ఈ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.