దుండిగల్, సెప్టెంబర్ 6: రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రతిభావంతులైన పేదబ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత చదువుకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని ప్రణీత్ప్రణవ్ సోలిటైర్ క్లబ్‌హౌజ్‌లో శనివారం ప్రణీత్గ్రూప్ నిర్వహణలోని కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ట్రస్ట్ ద్వారా 2025-26 విద్యాసంవత్సరంలో ఉన్నత చదువులు చదువుతున్న 35 మంది ప్రతిభావంతులైన పేదబ్రాహ్మణ విద్యార్థులకు సంబంధించి కళాశాలల ట్యూషన్ ఫీజులను రెన్యూవల్ చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సురభీవాణీదేవితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రణీత్గ్రూప్ సీఎండీ నరేంద్రకుమార్ కామరాజు తన నాన్నమ్మ పేరుతో కామరాజు అన్నపూర్ణమ్మ పేరిట చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి కొన్నేండ్లుగా పేదబ్రాహ్మణ విద్యార్థులను చదివిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. అనంతరం నరేంద్రకుమార్ కామరాజు మాట్లాడుతూ..
తాను సంపాదించిన దాంట్లో కొంతమొత్తం సేవాకార్యక్రమాలకు వినియోగించాలని మొదటి నుంచి అనుకున్నానని, అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదని భావించి గడిచిన కొన్నేండ్లుగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కళాశాల ట్యూషన్ ఫీజులు చెల్లిస్తూ చదివిస్తున్నామన్నారు. ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ కేవీఎస్ నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు, హూస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాదివిష్ణు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సబా గ్రూప్ ప్రతినిధి కేవీ ప్రదీప్, విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.