రవీంద్రభారతి, డిసెంబర్ 26 : తెలుగు చిత్ర పరిశ్రమలో షార్ట్ ఫిలిం పాత్ర ఎంతో కీలకమని ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు షార్ట్ ఫిలిం అవార్డుల కార్యక్రమం టీ హబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు చంద్రబోస్ పాల్గొని ఉత్తమ షార్ట్ ఫిలిం, దర్శక, నిర్మాతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్య పరిచే షార్ట్ ఫిలింలను నిర్మించాలని దర్శక, నిర్మాతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి అందెశ్రీ, కళారాజ్ అధినేత శ్రీనివాస్ మర్రి, సందీప్‌కుమార్ మక్తాల, శ్రీనివాస్‌రావు, ప్రవీణ్‌కుమార్ మాచవరం, గౌరీశంకర్ మామిడి పాల్గొన్నారు.