రవీంద్ర భారతి జూలై 4: సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన విద్యా హక్కు చట్టం ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిందని ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఏంవీ ఫౌండేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి కోరారు. హైదరాబాద్, బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్లో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీలపై ఆమ్ ఆద్మీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆప్ రాష్ట్ర నాయకులు బుర్ర రాము గౌడ్ అధ్యక్షత వహించగా అఖిల పక్ష నాయకులు, వివిధ సంఘాల నుంచి మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై 10 నుంచి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తే, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేయనున్నుట్లు తెలిపారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలని కోరారు. టీచర్స్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ నిర్ములించి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచాలన్నారు.
ఈ సమావేశంలో తల్లితండ్రుల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, చైల్డ్ రైట్స్ ఫోరమ్ ప్రతినిధి ప్రకాశ్, మదర్ లవ్ సంస్థ ప్రతినిధి డా. ఏ. శ్రీనివాస్, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి వెంకట్ సాయినాథ్, అక్షర ఫౌండేషన్ ప్రతినిధి ఆంజనేయులు, ఆప్ నేతలు డా. సోలొమన్ రాజ్, సుధారాణి, నర్సింగ్ యమునా గౌడ్, డా. లక్ష్య నాయుడు, జావీద్ షరీఫ్, జిల్లోజు హేమ, దర్శనం రమేశ్, సోహైల్, షాబాజ్, అజీజ్ బేగ్, రాకేశ్ రెడ్డి, రాకేశ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.