మల్కాజిగిరి/నేరేడ్మెట్/ గౌతంనగర్, జూలై 20: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైయింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారు లు, ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుండటంతో మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ టీంలు, డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు పురాతన ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే వీరికి సర్కిల్ అధికారులు నోటీసులు జారీ చేసి.. ప్రమాదం పొంచిఉందని వారిని ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రజలు ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ 91542 99643కు సమాచారం అందించాలని కోరారు. అవసరమైతేతప్ప ప్రజలు బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లవద్దని అన్నా రు. అయితే.. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుం డా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల డీసీలు రాజు, నాగమణి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, అల్వాల్, మచ్చ బొల్లారం డివిజన్లలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, జితేంద్రనాథ్లు వరదముంపు ప్రాం తాల్లో ఎమర్జెన్సీ టీంలతో కలసి పర్యటించి సహాయ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీఈఈ ప్రశాంతి, ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, హార్టికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్ పాల్గొన్నారు. నేరేడ్మెట్, వినాయకనగర్, యాప్రాల్, డిఫెన్స్‌కాలనీ తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. రోడ్ల పై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు విద్యుత్, ట్రాఫిక్, ఫైర్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. భారీ వర్షాలతో వివిధ శాఖల అధికారులు వరదనీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మౌలాలి డివిజన్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో మల్కాజిగిరి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది, మాన్సూన్ టీంలు పర్యటించి చర్యలు చేపట్టారు. దీన్‌దయాళ్‌నగర్ రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించారు. ఓల్డ్ సఫిల్‌గూడలో చేరిననీరు సాఫీగా వెళ్లేందుకు మ్యాన్‌హోళ్లకు అడ్డుగా ఉన్న రాయిని తీసివేశారు. వెంకటేశ్వరనగర్‌లో క్యాచ్ఫీట్లను తెరిచి శుభ్రం చేయడంతో సాఫీగా వర్షపునీరు వెళ్తున్నది.