కుత్బుల్లాపూర్,అక్టోబర్19: ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించడంతో పాటు కాలనీలను ఆదర్శవంతగా తీర్చిదిద్దిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కాంగ్రేస్ పార్టీ జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు సూదుల సంపత్‌గౌడ్ బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా అన్నారు. గురువారం డివిజన్లోని ఎంఎన్రెడ్డినగర్ ఫేస్-1 కాలనీలో జరిగిన చేరికల సభలో కాంగ్రేస్ పార్టీ నుండి సుమారు 150 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సంపత్‌గౌడ్ మాట్లాడుతూ కేవలం ఎంఎన్రెడ్డినగర్ కాలనీ ఫేస్-1లో రూ. సుమారు 4 కోట్ల వ్యయంతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించిన ఎమ్మెల్యే వివేకానంద్ పనితీరుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కేపీ విఏవకానంద్ను భారీ మేజార్టీతో గెలిపించుకునేందుకు సైనికుల్లా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరిన డివిజన్ ఉపాధ్యక్షులు బిక్షపతిగౌడ్, సహాయ కార్యదర్శి విజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపిరెడ్డి, సీనియర్ నాయకులు పరమేశ్వర్‌గౌడ్, రమేశ్, సత్యరామ్, రామాంజనేయులు, నరేంద్రమోహన్, శ్రీధర్, కరుణాకర్‌రెడ్డి, సోమయ్య, శివకుమార్, సాయి, వసంత్, ధనుష్‌రెడ్డి, శిరీష్, శైలజతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జీడిమెట్ల, ఆక్టోబర్ 19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, టీడీపీ ల నుంచి 100 మందికి పైగా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం సుభాష్‌నగర్ చివరి బస్టాప్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమక్షంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బలరాం రెడ్డి, సతీష్ గౌడ్, టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి దుర్గారావుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలను కప్పి ఎమ్మెల్యే సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు మన్నెరాజు, బొబ్బ రంగారావు, టీ.లక్ష్మారెడ్డి, అడపా శేషు, పద్మజా, మాధవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సత్యమూర్తి, లాల్ రాజు, బాల కుమార్, అమర్నాథ్ రెడ్డి, నాగ ప్రసాద్, నారాయణ, మురళీ రాజు, నాగేశ్వర్ రావు, కృష్ణ , శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల, ఆక్టోబర్ 19 : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గెలుపు కోరుతూ సుభాష్‌నగర్ డివిజన్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం సుభాష్‌నగర్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు దుర్గారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ను కలిసి రానున్న అసెంబ్లి ఎన్నికల్లో తమకే మద్దతు అని ఎమ్మెల్యేకు ఏకగ్రీవం చేసి తీర్మాణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముచ్చటగా మూడవ సారి హైట్రిక్ ఎమ్మెల్యేగా భారీ మేజార్టీతో గెలిపించుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నెరాజు, బొబ్బ రంగారావు, కర్ధాస్ రాజశేఖర్, అడపా శేషు, పద్మజా రెడ్డి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రకాశ్ గుప్త, అశోక్ గుప్త, బీమేష్ గుప్త, కిరణ్ గుప్త, శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.