సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన, మిస్సైన రూ.2కోట్ల విలువ చేసే సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి, బాధితులకు అప్పగించారు. ఈ మేరకు బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ ఎ.ముత్యంరెడ్డి రికవరీ చేసిన సెల్ఫోన్లను సంబంధిత యజమానులకు అందచేశారు.
అంతకు ముందు డీసీపీ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 8వ దఫాలుగా చోరీకి, మిసింగ్కు గురైన 6,233సెల్ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్)ద్వారా వివిద ప్రాంతాల నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గడిచన 45రోజుల్లో మాదాపూప్ సీసీఎస్ పోలీసులు 180సెల్ఫోన్లను, బాలానగర్ సీసీఎస్ పోలీసులు 174సెల్ఫోన్లను, మేడ్చల్ సీసీఎస్ పోలీసులు 176సెల్ఫోన్లను, రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు 153సెల్ఫోన్లు, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు 144ఫోన్ల చొప్పున మొత్తం 827ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
ఈ సెల్ఫోన్ల విలువ సుమారు రూ.2కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. అనంతరం రికవరీ చేసిన సెల్ఫోన్లను సంబంధిత యజమానులకు అందచేశారు. సెల్ఫోన్ల రికవరిలో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాలను ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ అదనపు డీసీపీ-1 రామ్‌కుమార్, సీసీఎస్ ఏసీపీ కె.నాగేశ్వర్రావు, మాదాపూర్ సీసీఎస్ సంజీవ్, శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ దాలి నాయుడు, రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.