మూసీపై మొండిగా ముందుకు..
మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లు కూల్చి రోడ్డున పడేయొద్దని పరీవాహక ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న స్థలాలను అన్యాయంగా లాక్కోవద్దని నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్నది.
- తొలిదశకు కేబినెట్ ఆమోదం
సిటీబ్యూరో: మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లు కూల్చి రోడ్డున పడేయొద్దని పరీవాహక ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న స్థలాలను అన్యాయంగా లాక్కోవద్దని నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రజల బాధలేవీ పట్టించుకోకుండా మూసీ ప్రాజెక్టు తొలిదశను రూ.735.12 కోట్లతో 21 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభించేందుకు గురువారం తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రజల వినతులు, నిరసనలు, ఆందోళనలు, అభ్యర్థనలు మూసీలో పడేసింది. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు తమ కష్టార్జితాన్ని లాక్కోవద్దని వేడుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధర్నాలు, నిరసనలు చేశారు. అయినా వారు చేసిన పోరాటాలు, వినతులను ఏమాత్రం లెక్క చేయలేదు. తొలి దశలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ దాకా భూసేకరణ చేయనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి.. గ్రామసభలు నిర్వహించింది. ఇక కేబినెట్ నిర్ణయంతో పనులను వేగవంతం చేయనున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

