అబిడ్స్, అక్టోబర్19: బీఆర్ఎస్తోనే సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బద్రుద్దీన్ నేతృత్వంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ప్రజా సంక్షేమంతో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధ్దికి కృషి చేసిందన్నారు. రానున్న రోజులు బీఆర్ఎస్వేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.