అబిడ్స్, సుల్తాన్‌బజార్, జనవరి 16 : కరోనా థర్డ్ వేవ్ వేగవంతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులు కొవిడ్ పరీక్షలను వేగవంతం చేశారు. కింగ్‌కోఠి క్లస్టర్ పరిధిలోని అన్ని యూపీహెచ్‌సీలతో పాటు ప్రభుత్వ దవాఖానల్లో ర్యాపిడ్, ఆర్టీ పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచింది. క్లస్టర్ పరిధిలోని అన్ని యూపీహెచ్‌సీలలో ప్రత్యేకంగా కరోనా పరీక్షలను చేపడుతూ కట్టడికి కృషి చేస్తున్నారు.దీంతో అత్యధికంగా పాజిటివ్ నిర్ధారణ ఐన ప్రాంతాల్లోప్రత్యేకించి మొబైల్ వాహనాల ద్వారా కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్కును కచ్చితంగా ధరించాలని కోరుతున్నారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి.
నిబంధలు పాటిస్తే శ్రీరామ రక్ష..
మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ మరింత విజృంభిస్తున్న తరుణంలో ఎవరికి వారు వారు జాగ్రత్తలను పాటిస్తేనే కట్టడిని చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వైద్యాధికారులు సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. ్ర కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో మాస్కును ధరించే ఉండాలన్నా రు. అత్యవసరమైతే గాని బయటకు రావద్దని సూచిస్తున్నారు.
కార్వాన్లో 30 మందికి పాజిటివ్ ..
కార్వాన్లో శుక్రవారం 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పన్నిపురా క్లస్టర్ ఎస్పీహెచ్వో డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. ఒకేరోజు 30 మందికి పాజిటివ్ నిర్దారణ కావడంతో కార్వాన్ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.