కుత్బుల్లాపూర్, జూన్ 5: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు జీవితఖైదు విధించింది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన శివకుమార్(42), శామ్యూల్ అలియాస్ శామెల్(19)లకు మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు జీవితఖైదుతో పాటు చెరో రూ. 10 వేల జరిమానా లేదా మరో ఏడాది పాటు సాధారణ జైలుశిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి జిల్లా చట్టపరమైన సేవల అధికార సంస్థ ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.