హిమాయత్ నగర్ : కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఢిల్లీలోని( Chalo Delhi) జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు (Mahadharna) బీసీలు అధిక సంఖ్యల్లో తరలివచ్చి విజయ వంతం చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ పిలుపు నిచ్చారు.
శనివారం హైదర్ గూడలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానం బిల్లును పార్ల మెంట్ లో ఆమోదించాలన్నారు.
విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, రాజకీయ రంగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నేతలు ఎర్ర శ్రీహరి, వి.శివ కుమార్, మల్లేష్ యా దవ్, గిరిగాని భిక్షపతిగౌడ్, నర్సింలు, శ్రీనివాస్ పాల్గొన్నారు.