సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నగరంలో అతి భారీ వానలు ముప్పు తొలిగిపోయిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కాగా, ఆవర్తన ప్రభావంతో రాగల 2రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారి వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా సోమవారం గరిష్ఠం 28.8 డిగ్రీలు, కనిష్ఠం 22.1డిగ్రీలు, గాలిలో తేమ 76శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.