కుత్బుల్లాపూర్, జనవరి 31: చోరీకి యత్నించిన ముగ్గురు దొంగలను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి జయభేరి కాలనీలోని ఓ ఇంట్లో శనివారం ముగ్గురు చోరీకి యత్నిస్తుండగా, స్థానికులు అప్రమత్తమయ్యారు. జయభేరి యూత్ వారియర్స్ రంగలోకి దిగి స్థానికులతో కలిసి దొంగలను బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.