శేరిలింగంపల్లి, జూన్ 19: నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లో యూఎస్ కాన్సులేట్ వద్ద వివిధ వామపక్ష పార్టీల నేతల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ యుద్ధ వైఖరిని ఖండిస్తూ వామపక్ష పార్టీల నేతలు ప్లకార్డులు చేత పట్టుకొని కాన్సులేట్ వద్ద ఆందోళనకి దిగారు. ఇజ్రాయిల్ మారన హోమ యుద్ధాన్ని తక్షణమే ఆపాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు ఇస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
యుద్ధం వలన సామాన్య పౌరులు ఇబ్బందులు పడతారని.. వెంటనే ఇరుదేశాలు శాంతిచర్చలు జరపడంతో పాటు యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధం వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాన్సులేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు భారీ కేర్లు అడ్డుగా పెట్టి నిరసనకారులను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వామపక్ష పార్టీల నేతలనుఆందోళనకారులను చెదరగొట్టి వ్యాన్లలో ఎక్కించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ల కు తరలించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, వామపక్ష పార్టీల నేతలు నర్సింహ, జంగయ్య, నర్సింహా రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.