సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శుక్రవారం రాత్రి తేలికపాటి వాన కురిసింది. రాత్రి 10గంటల వరకు శేరిలింగంపల్లిలో అత్యధికంగా 1.40సెం.మీలు, అమీన్పూర్లో 1.25సెం.మీలు, మియాపూర్లో 8మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.