హైదరాబాద్ : అడ్డగుట్టలో(Addagutta) దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి వివాహమాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యను హతమార్చి (Brutal murder) పరారయ్యాడు. ఈ విషాదకర సంఘటన తుకారాం గేట్ పీఎస్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. మృతురాలు రోజా(32)గా గుర్తించారు. హంతకుడు భర్త ఉప్పుతల లక్ష్మణ్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.