బడంగ్ పేట, ఫిబ్రవరి 15: రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా అమనగల్‌లో నిర్వహించే రైతు ధర్నా కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని జిల్లెలగూడలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలతో సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సరూర్‌నగర్ డివిజన్, ఆర్కే పురం డివిజన్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, తుక్కుగూడ జల్ పల్లి మున్సిపాలిటీలు, మహేశ్వరం కందుకూరు మండలాలకు సం బంధించిన నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతులు, బీఆర్ఎస్ శ్రే ణులు తుక్కుగూడకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అర్కల కామేశ్ రెడ్డి, రామిడి రామ్ రెడ్డి, అర్జున్, పవన్, అశోక్, రాజు నాయక్, రవి నాయక్, అనిల్ కుమార్ యాదవ్, యాదగిరి, సిద్దాల లావణ్య బీరప్ప, జంగారెడ్డి, తదితరులు ఉన్నారు.