మల్కాజిగిరి: అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇలంబర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మచ్చ బొల్లారం డివిజన్లోని ఏడు కాలనీల వర్షపు నీటి నిలువ సమస్యను పరిష్కరించేందుకు డ్రైన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
అల్వాల్ సర్కిల్ పరిధిలో ఫైర్ స్టేషన్ కోసం గ్రామకఠం స్థలాన్ని కేటాయించాలని, నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లను నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా.. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని చెప్పారు. నిధులు కేటాయించాలని గతంలో ఉన్న ఇద్దరు కమిషనర్లకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.