మేడ్చల్, మే 18(నమస్తే తెలంగాణ) : ప్రజల దాహార్తి తీర్చడంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆరోపించారు. ఐడీపీయల్లోని జలమండలి కార్యాలయం ఎదుట తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రూ. 2వేలు కోట్లు వెచ్చించి కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటిని అందజేశారన్నారు. మండు వేసవిలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యవస్థ నిర్వహణలో విఫలమైందని, ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.