మూసీ రివర్ ఫ్రంట్ పేరిట ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీ నదిని అందంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా ఫతేనగర్ మురుగు నీటి శుద్ధి కేంద్రం నుంచి బేగంపేట రెయిన్ గార్డెన్ వరకు 1.9 కిలోమీటర్ల మేర వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించేందుకు జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించారు. వాటర్ ఫ్రంట్ వాక్‌వేలు, వాటర్ వే, సైక్లింగ్ ట్రాక్‌లు, ఎకో పార్కు, గ్రీనరీ, ల్యాండ్ స్క్రేపింగ్, ఈవెంట్ స్పేస్, పెద్దలకు, చిన్నారులకు యాక్టివిటీ జోన్, శిల్పాలు, ఓపెన్ థియేటర్, వాటర్ ఫ్రంట్ ఫ్లోటింగ్ డక్‌లు, ఫుడ్ కోర్టులు తదితర ఏర్పాటుతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.
సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): మూసీ ప్రవాహానికి ఇరువైపులా సొబగులు అద్దేందుకు ప్రభు త్వం ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంది. అయితే, మూసీని కలుసుకునే నాలాల సుందరీకరణలో ప్రభు త్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఫతేనగర్ ఎస్టీ పీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) నుంచి బేగంపేట రెయి న్ గార్డెన్ 1.9 కిలోమీటర్ల మేర వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నాగోల్‌లో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరలో పచ్చదనం పెంపొందించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీ నదిని వైవిధ్యంగా, విభిన్నంగా, కొత్త సొబగులతో అలరించేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా, నగర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటి తో పాటు ప్రధానంగా మంచిరేవుల నుంచి గౌరెల్లి వరకు మూసీ పొడవునా 55 కిలోమీటర్ల మేరలో రూ.10 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో జీడిమెట్ల నుంచి హుస్సేన్‌సాగర్ తీరం వరకు ఉన్న కూకట్పల్లి నాలా వెంబడి కొత్త అందాలను పరిచయం చేయాలని నిర్ణయించారు. మూసీ సుందరీకరణలో ఈ నాలా వెంబడి బేగంపేట వద్ద రెయిన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఫతేనగర్ ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) నుంచి బేగంపేట రెయిన్ గార్డెన్ 1.9 కిలోమీటర్ల మేర వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపొందించేందుకు జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించారు. వాటర్ ఫ్రంట్ వాక్‌వేలు, వాటర్ వే, సైక్లింగ్ ట్రాక్‌లు, ఎకో పార్కు, గ్రీనరీ, ల్యాండ్ స్క్రేపింగ్, ఈవెంట్ స్పేస్, పెద్దలకు, చిన్నారులకు యాక్టివిటీ జోన్, శిల్పాలు, ఓపెన్ థియేటర్, వాటర్ ఫ్రంట్ ఫ్లోటింగ్ డక్‌లు, ఫుడ్ కోర్టులు తదితరాల ఏర్పాటుతో వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్తో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఆసక్తి గల ఎజెన్సీలు డీపీఆర్‌లు సమర్పించాలని జీహెచ్ఎంసీ కోరింది. ఈ నెలాఖరులోగా ఈ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.
జలమండలిలో వివిధ హోదాల్లో పనిచేసిన 40 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. పలు డివిజన్లలో 10 మంది టెక్నికల్ గ్రేడ్-2, 17 మంది ఎస్సీఈలు, మరో 13 మంది జీపీఈలుగా పనిచేసి గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఈ 40 మందికి సోమవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విమరణ ద్వారా లభించే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు చెక్కు రూపంలో వారికి జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం మహమ్మద్ అబ్ధుల్ ఖాదర్‌లు అందజేశారు.