చార్మినార్, జూలై 22: పాతబస్తీలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మస్కతి తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో అలీ మస్కతి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలీ మస్కతి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు చార్మినార్ నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి ఆదివారం బీఆర్ఎస్ భవన్లో గులాబీ కండువా కప్పుకుంటారని తెలిపారు.