సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్‌ను ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఇటీవల శివారు 27 పురపాలికలు జీహెచ్ఎంసీలో విలీనమై 300 వార్డులుగా మహా గ్రేటర్‌గా జీహెచ్ఎంసీ ఏర్పడింది. జీహెచ్ఎంసీ విస్తరణ వైశాల్యం 2053 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఈ నేపథ్యంలో విలీనమైన పురపాలకలను కలుపుకొని మొత్తంగా బడ్జెట్ రూపకల్పన అనివార్యమైంది. దాదాపు 13వేల కోట్లతో మహా బడ్జెట్ సిద్ధమైంది. ఈ నెల 29న మేయర్ అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు.
ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు బడ్జెట్ ప్రతిపాదనలు అందజేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విలీన పురపాలకలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు రూ. 13 వేల కోట్ల మారును చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెవెన్యూ రిసీట్స్ రూ.4,445 కోట్లుగా ఉంటే ఈ ఏడాది 5,550 కోట్లుగా ఉండొచ్చని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.4000 కోట్లుగా ప్రస్తుతముంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ వ్యయం రూ.5500 కోట్లుగా పెరుగుతుందని, హెచ్సిటీ ప్రాజెక్టులు కార్యరూపంలోకి రానున్నాయి.