Mahesh Bhagwat | కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 7: పరిశ్రమలు.. విద్యాసంస్థలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు నిపుణులు మరింత కృషి చేయాలని సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అన్నారు. జేఎన్టీయూహెచ్లో ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అండ్ అపార్చునిటీ నెట్వర్క్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నెట్వర్కింగ్ సహకారం, స్కిల్ డెవలప్మెంట్, యువత కోసం ఉపాధి కల్పన లక్షణాలతో రికగ్నైజ్, రి కనెక్ట్, రి ఇన్వెంట్ (ఆర్ఆర్) అనే థీమ్‌తో మల్టీనేషనల్ కంపెనీల హెచ్ఆర్, సీఈవోలతో హెచ్ఆర్ కాంక్లెవ్ను నిర్వహించారు.
ముఖ్యఅతిథులుగా అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావు, పూర్వ విద్యార్థల వ్యహహారాల డైరెక్టర్ సురేశ్‌కుమార్, యూఐఐసీ డైరెక్టర్ రజని, స్ప్రిపుల్ సీఈవో బూర వెంకట్, స్ప్రెడియన్ టెక్నాలజీస్ హెచ్ఆర్ హెడ్ రెమెళ్ల శ్రీధర్, అరవింద్, కరుణ వెంపల, రాజేశ్ దుడ్డు, సంజీత్శర్మ హాజరయ్యారు. విద్యార్థులకు మెరుగైన ప్లేస్మెంట్ కోసం పరిశ్రమలకు, విద్యా సంస్థలకు అంతరాలను తగ్గించడం, నైపుణ్యం, వైవిధ్యం, ఈక్వీటీ, కలుపుగోలుతనం, ఐటీలో తాజా అవాంతరాలు, ఏఐ, చాట్ జీపీటీల పాత్ర అంశాలపై చర్చించారు. అనంతరం 100 మంది పబ్లిక్, కార్పొరేట్ అడ్మినిస్ట్రేటర్లకు అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో 300 మంది సీఎక్స్‌వోలు, హెచ్ఆర్లు, విద్యావేత్తలు, పలు కళాశాలలకు చెందిన ప్లేస్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.