మాదాపూర్, ఆగస్టు 26: నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసుల వైఫల్యంతో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశాళాలలో టీటీ కోసం వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా వెనకాల కూర్చున్న ఓ యువతిని బోరబండకు చెందిన ముగ్గురు ఆకతాయిలు నెమలి ఈకతో అసభ్యంగా తాకుతూ వెళ్లారు.
ఈ వీడియో ఎక్స్‌లో వైరల్ కావడంతో పోలీసులు ఆకతాయిలపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు ముగ్గురు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మైనర్లు కావడంతో కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి పంపించినట్లు తెలిపారు.